హైదరాబాద్: కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ కొత్త జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో కరోనా వైరస్ కేసులు ఉన్న ప్రాంతాలను మూడు జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మరో కేంద్ర ప్రభుత్వం రెడ్, ఆరెంజ్, గ్రీన జోన్ల వివరాలను వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సదన్ ఈ వివరాలను తెలిపారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆమె దీనికి సంబంధించి లేఖలు రాశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తూ జాబితాను రిలీజ్ చేశారు. రికవరీ రేటు పెరిగిన తర్వాత కొత్తగా ఈ జోన్ల లిస్టును తయారు చేశారు. తాజా జాబితా ప్రకారం 130 జిల్లాలు రెడ్ జోన్‌లో, 284 ఆరెంజ్ జోన్, 319 గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 35 వేలు దాటింది. మరణించిన వారి సంఖ్య 1147గా ఉన్నది. తెలంగాణలో ఆరు రెడ్ జోన్లు, 18 ఆరెంజ్ జోన్లు, 9 గ్రీన్ జోన్లు ఉన్నాయి. రెడ్ జోన్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా ఉంటాయి.
కొత్త రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితా రిలీజ్..